మా అమ్మలాగే వుంది!


Wed,March 14, 2018 12:15 AM

Mahesh.jpg
స్టార్‌గా ఎంత బిజీగా వున్నా హీరో మహేష్‌బాబు తన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంటారు. ప్రస్తుతం కొరటాల శివ రూపొందిస్తున్న భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న ఆయన తాజాగా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో తన గారాలపట్టి సితార ఫొటోను షేర్ చేస్తూ తను అచ్చు తన తల్లి ఇందిరాదేవిలానే వుందని వ్యాఖ్యానించారు. పింక్..గర్ల్ పవర్..చూడటానికి అచ్చం మా అమ్మలాగే వుంది అని పోస్ట్ చేశారు. దీనికి తోడు హార్ట్ సింబల్స్‌ని కూడా పోస్ట్ చేయడం మహేష్‌బాబు అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ ఫొటోను మహేష్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మందికి పైగా లైక్ చేశారు. మహేష్‌బాబు నటిస్తున్న భరత్ అనే నేను. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు భరత్ రామ్ అనే పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల చేసి చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

6059

More News

VIRAL NEWS