మేజర్ అజయ్ కృష్ణ...


Thu,July 11, 2019 12:34 AM

mahesh babu name in sarileru neekevvaru revealed

ఆర్మీ మేజర్‌గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో కనిపించబోతున్నట్లు అనిల్ రావిపూడి బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తులతో కూడిన నేమ్‌ప్లేట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు కశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని, 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై దిల్‌రాజు, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది.

1799

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles