గెలిచి చూపించడం అలవాటు


Tue,April 9, 2019 11:24 PM

mahesh babu maharshi teaser all time record

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్..సక్సెస్ ఈజ్ జర్నీ...ఓడిపోతావ్ అంటే, గెలిచి చూపించడం నాకు అలవాటు అంటూ టీజర్‌లో మహేష్‌బాబు చెప్పిన స్ఫూర్తివంతమైన సంభాషణలు ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్‌మీడియాలో వీక్షణలపరంగా మహర్షి టీజర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. కేవలం 24గంటల్లోనే 12.6 మిలియన్ రియల్‌టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 9న ప్రేక్షకులముందుకుతీసుకొస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. మనలోని ప్రతి ఒక్కరి కథ ఇదని, ఓ సామాన్య యువకుడు తన జీవన ప్రయాణంలో మహర్షిగా ఎలా మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు వంశీపైడిపల్లి తెలిపారు.

2667

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles