అడుగుకి పదును పెట్టి పదరా


Thu,April 25, 2019 12:00 AM

Mahesh Babu  Maharshi pre release event on May 1st

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలోని పదరా పదరా పదరా నీ అడుగుకి పదనుపెట్టి పదరా అనే గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. శంకర్‌మహదేవన్ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. రైతుల నేపథ్యంలో సాగే ఈ గీతంలో మహేష్‌బాబు నాగలితో దుక్కి దున్నుతూ, వరినాట్లు వేస్తూ వ్యవసాయదారుడిగా కనిపిస్తున్నారు.

మహేష్‌బాబు తొలి చిత్రం రాజకుమారుడులో బాలీవుడ్ బాలరాజు.. అనే పాటను ఆలపించాను. మళ్లీ ఆయన ఇరవై ఐదవ సినిమాలో మరో మంచి పాటను పాడటం ఆనందంగా ఉంది. స్ఫూర్తివంతమైన గీతమిది అని గాయకుడు శంకర్ మహదేవన్ చెప్పారు. రైతు సమస్యలకు సమకాలీన అంశాలను మేళవిస్తూ దర్శకుడు వంశీపైడిపల్లి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మే 1న ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

2032

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles