ఆదిత్య అరుణాచలం పవర్

Thu,November 7, 2019 11:48 PM

రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు మోషన్‌పోస్టర్‌ను గురువారం హీరో మహేష్‌బాబు విడుదలచేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో ఖాకీ దుస్తుల్లో నేరస్తులపై కత్తి దూస్తూ రజనీకాంత్ కనిపిస్తున్నారు దర్బార్ మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రజనీకాంత్‌పై ఉన్న అభిమానం, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయి అని మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం అనే శక్తివంతమైన పోలీస్‌గా రజనీకాంత్ కనిపిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదలచేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

595

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles