మహేష్ వినమ్రత

Mon,February 11, 2019 12:18 AM

టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటగా పేరుతెచ్చుకున్నారు మహేష్‌బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు. వీరిద్దరి అన్యోన్యతను చూసిన వారంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు. ఆదివారంతో మహేష్, నమ్రతల పళ్లై పధ్నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నమ్రతతో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు మహేష్‌బాబు. మధురమైన జ్ఞాపకాలు..హ్యాపీ యానివర్సరీ మై లవ్ అంటూ వ్యాఖ్యను జోడించారు. ఈ ఫొటోలో మహేష్‌బాబు, నమ్రత చిరునవ్వులు చిందిస్తూ ఆనందభరితులవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటున్నది. అందమైన జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలంటూ అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

1982

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles