ఖైదీ ఖతర్నాక్..

Sun,November 3, 2019 12:14 AM

కార్తి కథానాయకుడిగా నటించిన ఖైదీ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విమర్శకుల్ని మెప్పిస్తున్నది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు అద్భుత చిత్రమని కొనియాడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై అగ్ర హీరో మహేష్‌బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్‌తో ఖైదీ చిత్రం చాలా బాగుంది. ఆకట్టుకునే స్క్రిప్ట్, థ్రిల్లింగ్ యాక్షన్ ఘట్టాలతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ప్రతి ఒక్కరు అద్భుతమైన నటన కనబరిచారు. ఇలాంటి సబ్జెక్ట్‌లో పాటలు లేకపోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఖైదీ టీమ్‌కు నా అభినందనలు అంటూ మహేష్‌బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ర్టాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్ పతాకంపై కె.కె.రాధామోహన్ విడుదల చేశారు.

524

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles