ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..


Fri,January 11, 2019 11:23 PM

Mahesh Babu birthday wishes to Sukumar

రంగస్థలం సినిమాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు సుకుమార్.గ్రామీణ నేపథ్య ఇతివృత్తానికి మానవీయ విలువల్ని జోడించి హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసల్ని అందుకున్నారు. రంగస్థలం తర్వాత మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నారు సుకుమార్. వన్ నేనొక్కడినే తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందనున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. అయితే ఈ సినిమాపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పారు మహేష్‌బాబు.
Sukumar
శుక్రవారం సుకుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మహేష్‌బాబు మన సినిమా ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. సుకుమార్ కెరీర్‌లో ఈ ఏడాది గొప్పగా నిలవాలని పేర్కొన్నారు. సుకుమార్, మహేష్‌బాబు కలయికలో రూపొందిన వన్ నేనొక్కడినే చిత్రం ఐదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రీకరణలో సుకుమార్‌తో ముచ్చటిస్తున్న ఓ వర్కింగ్‌స్టిల్‌ను అభిమానులతో పంచుకున్న మహేష్‌బాబు ఆ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు.

3165

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles