సుకుమార్ దర్శకత్వంలో..


Mon,April 16, 2018 12:11 AM

Mahesh
రంగస్థలం విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వున్నారు దర్శకుడు సుకుమార్. మానవీయ విలువలు, సహజత్వం మేలికలయికగా ఎనభైదశకాన్ని వెండితెరపై పునఃసృష్టించిన ఆయన సృజనాత్మక ప్రతిభకు యావత్ ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. ఇటీవలే విడుదలైన రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. రెండువందల కోట్ల్ల మైలురాయి దిశగా పరుగులు తీస్తున్నది. రంగస్థలం అఖండ విజయంతో సుకుమార్ తదుపరి చిత్రమేమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం మహేష్‌బాబు కథానాయకుడిగా సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్-మహేష్ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడనుంది. వినూత్న కథాంశంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. సుకుమార్-మహేష్‌బాబు కలయికలో 1 నేనొక్కడినే వంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2440

More News

VIRAL NEWS