రైతులందరికి ‘మహర్షి’ అంకితం


Mon,May 20, 2019 04:18 AM

Maharshi movie success event at Vijayawada

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకుడు. సి.అశ్వనీదత్, పీవీపీతో కలిసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా విజయవాడలో శనివారం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ నా సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయినప్పుడల్లా దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడికి పిలుస్తుంది. మహర్షి విషయంలోనూ అదే జరగడం ఆనందంగా వుంది. మహర్షి పోస్టర్ చూస్తుంటే గర్వంగా వుంది. అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు ఇలా ముగ్గురు కలిసి నా 25వ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పనిచేసిన వారంతా నాకు చాలా ప్రత్యేకం. కథ విన్నప్పటి నుంచి ఇది పెద్ద హిట్ అవబోతుందని భావించాను. డెహ్రాడూన్‌లో తొలి రోజు చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఈ సినిమా పోకిరి స్కేర్ అవుతుందని చెప్పాను. సినిమాలో మూడు పార్శాలున్న పాత్రలో నటించాను. అందులో నాకు బాగా నచ్చింది కాలేజీ స్టూడెంట్ పాత్ర. నాకు మంచి కిక్‌నిచ్చింది. నా 25వ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులందరికి రుణపడి వుంటాను. గురుస్వామి ఆశీస్సుల వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అన్నారు.

pooja-hegde
దిల్‌రాజు మాట్లాడుతూ ముగ్గురం కలిసి మహేష్‌బాబు 25వ చిత్రాన్ని నిర్మించడం మా అందరికి చాలా ఆనందకర క్షణమిది. ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని సక్సెస్‌లు వచ్చినా కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మా అందరికి మహర్షి అలా గుర్తుండిపోయే సినిమా అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ మనం ఈ దేశంలో ఇంత చల్లగా ఉంటున్నాం అంటే అది ఇద్దరి వల్లే. ఒకరు బోర్డర్‌లో తుపాకి పట్టిన సైనికుడు. మరొకరు పొలంలో నాగలి దింపిన రైతు. ఈ చిత్రాన్ని భారత దేశంలో వున్న రైతులందరికి అంకితం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, సి.అశ్వనీదత్, పీవీపీ, అల్లరి నరేష్, పూజా హెగ్డే, అనిల్ రావిపూడి, అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.

3025

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles