పొల్లాచ్చిలో వ్యవసాయం


Sun,January 20, 2019 11:55 PM

maharshi movie released April

ఇప్పుడు ఎక్కడ చూసినా రైతు గురించిన మాటలే వినిపిస్తున్నాయి. రాజకీయం కూడా రైతు చుట్టే తిరుగుతున్నది. దీంతో కథానాయకులు కూడా రైతు పాత్రలకు సై అంటున్నారు. అగ్ర హీరో మహేష్‌బాబు తన తాజా చిత్రం మహర్షిలో రైతు పాత్రలో కనిపించబోతున్నారు. నాగలి చేతబట్టి పొలం మడుల్లో దుక్కి దున్నుతూ వ్యవసాయానికి సిద్ధమయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కేరళలోని పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. పూజా హేగ్డే కథానాయిక. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో మహేష్‌బాబు కాలేజీ స్టూడెంట్‌గా, రైతుగా రెండు భిన్న పార్శాల్లో సాగే పాత్రను పోషిస్తున్నారని సమాచారం.

పొల్లాచ్చిలో మహేష్‌బాబు వ్యవసాయం చేస్తున్న సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానుగుణంగా ద్వితీయార్థంలో మహేష్‌బాబు రైతు పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. స్నేహం గొప్పతనాన్ని , మానవీయ అనుబంధాల ఔన్నత్యాన్ని తెలియజెప్పే ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రైతు సమస్యలపై కూడా చర్చించబోతున్నారని తెలిసింది. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకులముందుకురానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

2337

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles