నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం

Sat,April 13, 2019 09:00 AM

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్‌మీడియాలో రికార్డు వీక్షణలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను (రెండోగీతం) శుక్రవారం విడుదల చేశారు. నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం అనే పల్లవితో ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని యాజిన్ నిజార్ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఫస్ట్‌సింగిల్ ఛోటి ఛోటి బాతే.. సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, మానవీయ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మహేష్‌బాబు పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది.


1293

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles