మహర్షి ప్రయాణం


Thu,August 9, 2018 11:56 PM

Maharshi Movie Official First Look Teaser

మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి మహర్షి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రమిది కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గురువారం మహేష్‌బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు. జాయిన్ ది జర్నీ ఆఫ్ రుషి అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌లో సరికొత్త కేశాలంకరణ, మీసంకట్టుతో మహేష్‌బాబు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు డెహ్రాడూన్, హైదరాబాద్, గోవాలలో షెడ్యూల్స్ జరుపుకుందీ చిత్రం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్.

2438

More News

VIRAL NEWS