మహర్షి తొలి అడుగు


Sat,March 23, 2019 11:53 PM

Maharshi first song to release on March 29th

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలు. పూజాహేగ్డే కథానాయిక. మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రమిది కావడం విశేషం. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. దుబాయ్‌లో పాటల్ని తెరకెక్కించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాల కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను (తొలి గీతం) ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్లు దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో మహర్షి ప్రమోషన్ కార్యక్రమాలకు తొలి అడుగు పడబోతున్నదని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మే నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా, రైతుగా భిన్న పార్వాల్లో సాగే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. విద్యావంతుడు, ఆదర్శభావాలు కలిగిన యువకుడు రైతుగా మారి హలం ఎందుకు పట్టాల్సి వచ్చిందనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. కుటుంబ అనుబంధాలు, రైతు సమస్యల నేపథ్యంలో రూపొందిస్తున్న ఎమోషనల్ డ్రామా ఇదని చిత్ర బృందం చెబుతున్నది. ఇందులో మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

2602

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles