మహానుభావుడి ప్రేమపాట్లు


Tue,September 19, 2017 10:50 PM

mahanubhavudu
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహానుభావుడు. మారుతి దర్శకుడు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర పాటల ప్రదర్శన సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సంపూర్ణ హాస్యభరిత చిత్రమిది. అందుకే పండగ సమయంలో విడుదల చేయాలని భావించాం. ఈ సినిమాపై అందరూ పాజిటివ్‌గా వున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్లవరకు అందరూ ఆస్వాదించేలా సినిమా వుంటుంది. శర్వానంద్ పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది . అతిశుభ్రం అనే డిజార్డర్‌తో బాధపడే ఆనంద్ అనే యువకుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి పాట్లు పడ్డాడన్నదే చిత్ర కథ అన్నారు. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. నా కెరీర్‌లో విభిన్నమైన పాత్రను చేసే అవకాశం లభించింది. పండగ వేళలో అందరికి ఆనందాల్ని పంచే చిత్రమవుతుంది అని శర్వానంద్ చెప్పారు. చక్కటి హాస్యం మేళవించిన సకుటుంబ కథా చిత్రంగా అందరిని ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.

664

More News

VIRAL NEWS