నిశ్శబ్దం మొదలైంది


Sat,May 25, 2019 11:00 PM

Madhavan Anushka Unite For Nishabdam

భాగమతి తరువాత నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకుంది అనుష్క. ఆమె నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, షాలిని పాండే. అంజలి, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైలెన్స్ పేరుతో ఇతర భాషల్లో విడుదల చేయనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచి భోట్ల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హారర్ థ్రిల్లర్ కథాంశమిది. అత్యధిక భాగం అమెరికా నేపథ్యంలో కథ సాగుతుంది.

1944

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles