యమ్6 రహస్యం!


Sat,January 5, 2019 11:25 PM

m6 trailer launched director vv vinayak

ధ్రువ, శ్రావణి, అశ్విని, తిలక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం యమ్6. జైరామ్‌వర్మ దర్శకుడు. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకంపై విశ్వనాథ్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వినాయక్‌గారు విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఆద్యంతం కొత్తగా ఉంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి క్వాలిటీతో నిర్మించాం. కొత్తవాళ్లయిన ధ్రువ, అశ్విని అద్భుతంగా నటించారు. సరికొత్త నేపథ్యంలో ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కెమెరా, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.

యమ్6 వెనకున్న రహస్యం ఏమిటన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. నా తొలి చిత్ర ట్రైలర్‌ను వి.వి.వినాయక్ వంటి ప్రముఖదర్శకుడు విడుదల చేయడం ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ చిత్రంలో అన్ని వర్గాలకు నచ్చే అంశాలన్ని ఉన్నాయి అని హీరో ధ్రువ తెలిపారు.

815

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles