డబ్బు కోసం పరుగు

Fri,November 22, 2019 11:51 PM

సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎం3’.‘మ్యాన్‌ మ్యాడ్‌ మనీ’ ఉపశీర్షిక. రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. డబ్బు కోసం అడ్డదారుల్లో ప్రయాణించిన కొందరు యువతీయువకులకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. కథాబలమున్న మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచుతుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య కొత్తవారైనా చక్కటి నటనను కనబరిచారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం, కల్యాణ్‌ సమి ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అని అన్నారు.


213

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles