త్రీడీలో లీసా


Fri,May 10, 2019 12:14 AM

Lisa Movie release date Anjali all set to evoke fear from May 24

అంజలి కథానాయికగా నటిస్తున్న చిత్రం లీసా. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. లీసా ఎవరు? ఓ ఇంట్లో ఆమెకు ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. అంజలి నటన, పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటాయి. టైటిల్ పాత్రకు ఆమె పరిపూర్ణంగా న్యాయం చేసింది. మకరంద్‌దేశ్‌పాండే, బ్రహ్మానందం పాత్రలు, పి.జి.ముత్తయ్య సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి. 100 రోజులకుపైగా చిత్రీకరణ జరిపాం. త్వరలో ఆడియోతో పాటు ట్రైలర్‌ను విడులచేస్తాం అని తెలిపారు. అంజలి మాట్లాడుతూ త్రీడీలో నేను నటిస్తున్న తొలి చిత్రమిది. ప్రతిక్షణం థ్రిల్‌ను పంచుతూనే ఈ సినిమా భయపెడుతుంది అని చెప్పింది. త్రీడీలో విడుదలవుతున్న తొలి తెలుగు హారర్ సినిమా ఇదని, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని అలరిస్తుందని సురేష్ కొండేటి చెప్పారు. సలీమా, మైమ్‌గోపీ, సురేఖవాణి, కళ్యాణి నటరాజన్, సబితారాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ దయానిధి.

623

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles