లక్ష్మీపార్వతి లుక్


Fri,January 11, 2019 11:06 PM

LAXMIS NTR LAXMI PARVATHI FIRST LOOK Teaser

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న అత్యంత కీలకమైన పరిణామాల్ని ఆధారంగా చేసుకొని వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శుక్రవారం లక్ష్మీపార్వతి పాత్ర లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదలచేశారు వర్మ. ఈ పాత్రలో కన్నడ నటి యజ్ఞాశెట్టి నటిస్తున్నది. ఇతర కీలక పాత్రల్లో నూతన నటీనటులు కనిపిస్తున్నారు. లక్ష్మీపార్వతి తో పాటు ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా సమాచారాన్ని సేకరించి నిరూపించగలిగే నిజాలతో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు రామ్‌గోపాల్‌వర్మ. రాకేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3201

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles