సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్


Thu,April 20, 2017 12:17 AM

Lavanya-Tripathi
సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం మాయావన్. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.బి.కె ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై నిర్మాత ఎస్.కె.బషీద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత ఎస్.కె.బషీద్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓ కేసు చిక్కుముడిని విప్పే క్రమంలో పోలీస్ అధికారికి ఎలాంటి అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయన్నది థ్రిల్‌ను కలిగిస్తుంది. సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి పాత్రలు నవ్యరీతిలో ఉంటాయి. వారిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కొడైకెనాల్, చెన్నైలలో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 27 వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. సినిమా టైటిల్‌తో పాటు ఆడియో విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు.

788

More News

VIRAL NEWS