భిన్న ధృవాల కథ


Mon,June 10, 2019 11:28 PM

Last Seen Movie Trailer Launch Press Meet

హర్షకుమార్‌, తులికసింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాస్ట్‌సీన్‌'. గ్లిట్టర్‌ ఫిల్మ్‌ అకాడమీ, ఏ.జి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీపక్‌ బల్దేవ్‌ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్‌ బాగుంది. వినూత్నమైన ఇతివృత్తంతో దర్శకుడు దీపక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు. ‘భిన్న ధృవాల్లాంటి ఓ జంట కథ ఇది. సిటీలోనే స్థిరపడాలనే ఓ యువతికి, గ్రామాలే ఉత్తమమని భావించే ఓ యువకుడికి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎవరి పంతం నెగ్గిందనేది ఆసక్తిని పంచుతుంది. హైదరాబాద్‌, ఊటీలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ, రవికుమార్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

392

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles