సెన్సార్ క్లియర్


Tue,March 26, 2019 01:22 AM

lakshmis ntr movie release 29 March 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర సెన్సార్ విషయంలో గత కొన్నాళ్లుగా సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో సెన్సార్ పూర్తవుతుందా? సినిమా విడుదలవుతుందా? అంటూ అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ సినిమా సెన్సార్ పూర్తయినట్లు చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిజం గెలిచింది చంద్రబాబు. యు సర్టిఫికెట్‌తో సెన్సార్ బోర్ట్ ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చింది అని తెలిపారాయన. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. అగస్త్యమంజు, రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు.

1106

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles