చక్కటి అనుభూతిని పంచింది

Sat,October 19, 2019 12:02 AM

పెళ్లిచూపులు తర్వాత చక్కటి అనుభూతిని పంచిన చిత్రమిది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది అని అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. రాకేశ్ వర్రె కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. బసవ శంకర్ దర్శకుడు. గార్గేయి ఎల్లాప్రగడ కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను వీక్షించిన నిర్మాత లగడపాటి శ్రీధర్ చిత్రబృందంపై ప్రశంసల్ని కురిపించారు. ఆయన మాట్లాడుతూ హీరోగా, నిర్మాతగా రాకేష్ ప్రతిభను చాటుకున్నారు. బసవశంకర్ అర్థవంతంగా సినిమాను తెరకెక్కించిన తీరు బాగున్నది. సినిమాటోగ్రఫీ, సంభాషణలు..ప్రతి విభాగం పనితీరు అద్భుతంగా ఉంది అని అన్నారు. హీరో రాకేష్ మాట్లాడుతూ నెమ్మదిగా వసూళ్లు ప్రారంభమై మౌత్‌టాక్‌తో పాటు సినీ పెద్దల ప్రోత్సాహంతో మా సినిమా హౌస్‌ఫుల్ దిశగా సాగిపోతుండటం ఆనందంగా ఉంది అని చెప్పారు.

383

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles