తెలుగు గల్లీబాయ్‌లా వుంటుంది


Fri,May 24, 2019 12:32 AM

lagadapati sridhar about yevadu thakkuva kadu movie

నిజాయితీతో కూడిన వినూత్నమైన ప్రయత్నమిది. మా అబ్బాయి చేసిన మంచి సినిమా ఇదని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది అని అన్నారు లగడపాటి శ్రీధర్. తనయుడు విక్రమ్ సహిదేవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం ఎవడు తక్కువ కాదు. రఘు జయ దర్శకుడు. ప్రియాంకజైన్ కథానాయిక. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళ చిత్రం గోలీసోడా ఆధారంగా రూపొందిన చిత్రమిది. పట్టుదల కలిగిన ఓ టీనేజ్ కుర్రాడు తాను కన్న కలను ఎలా సాకారం చేసుకున్నాడనే పాయింట్‌తో స్ఫూర్తిదాయకంగా ఈ కథ సాగుతుంది. తెలుగు గల్లీబాయ్‌లా అనిపిస్తుంది. సంకల్పబలం ఉంటే ఎంతటి కార్యాన్ని అయినా సాధించవొచ్చనే గొప్ప సందేశం మేళవించిన చిత్రమిది.

ఓ మార్కెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవికతకు ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు రఘుజయ ఈ చిత్రాన్ని రూపొందించారు. కథే ఈ సినిమాకు హీరో. ప్రేమ, ప్రతీకారం, రొమాన్స్‌తో పాటు వాణిజ్య హంగులన్నీ ఉంటాయి. మా తనయుడు విక్రమ్ తొలిసారి పూర్తి నిడివితో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే టెన్షన్ ఎక్కువగా ఉంది. ట్రైలర్‌లో విక్రమ్ నటన చూసిన దర్శకుడు సుకుమార్ అతడి కోసం తప్పకుండా ఏదో ఒకరోజు కథ రాస్తానని చెప్పడం అమితానందాన్ని కలిగించింది. విక్రమ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. సవాలుతో కూడిన పాత్రలో అతను ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు. నటుడిగా ఈ సినిమాతో తొలిమెట్టు ఎక్కాడు. ఏవడిగోలవాడిదే, ైస్టెల్ తర్వాత మా సంస్థలో మరో పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.

1637

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles