సందేశంతో ‘కేఎస్‌ 100’


Sat,June 15, 2019 11:36 PM

Ks 100 title logo released

సమీర్‌ఖాన్‌, శైలజ, శ్రద్ధాశర్మ, అక్షిత, ఆషి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కేఎస్‌ 100’. షేర్‌ దర్శకుడు. కె. వెంకట్రామ్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కుమార్‌, స్వామి అనే ఇద్దరు స్నేహితుల మధ్య కథ సాగుతుంది. అందుకే కేఎస్‌ అని టైటిల్‌ పెట్టాం. ఈ సినిమా ద్వారా యువతకు మంచి సందేశాన్నందిస్తున్నాం. అమ్మాయిల్లో ధైర్యాన్ని పెంచేలా ఈ కథ ఉంటుంది’ అన్నారు. ‘ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 250థియేటర్లలో జూలై 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. యువతరం మెచ్చే చిత్రమవుతుంది’ అని నిర్మాత తెలిపారు.

528

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles