కెఎస్ 100 ప్రేమకథ


Fri,March 15, 2019 11:16 PM

ks 100 movie releasing on march last week

సమీర్‌ఖాన్, శైలజ జంటగా నటిస్తున్న చిత్రం కెఎస్ 100. వెంకట్‌రెడ్డి నిర్మాత. షేర్ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. కె.ఎస్ 100 అనే నంబర్ వెనకున్న రహస్యమేమిటి? ఆ చిక్కుముడిని ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నది ఆకట్టుకుంటుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. సెన్సార్‌కు సిద్ధమైన చిత్రాన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. అక్షిత, సునీత, కల్పన, అజీమ్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నవనీత్‌చారి సాహిత్యం: భాషాశ్రీ, కెమెరా: వంశీ

657

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles