ఉప్పెనలో కృతిశెట్టి


Sat,May 18, 2019 11:49 PM

krithi shetty to introduce in vaisshnav tej s uppena

సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ఉప్పెన. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాలో మంగళూరుకు చెందిన కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. వినూత్న ప్రేమకథా ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: నవీన్‌నూలి, ఆర్ట్: మోనిక రామకృష్ణ, నిర్మా సంస్థ: మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సాన.

1552

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles