సూపర్‌ మార్కెట్‌ నేపథ్యంలో..


Mon,June 17, 2019 11:03 PM

Krishna Rao Supermarket Movie Teaser

హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌'. బీజేఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాథ్‌ పులకరం దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదలైంది. సీనియర్‌ నటుడు సుమన్‌ మాట్లాడుతూ ‘ రెండున్నర గంటల పాటు ఆహ్లాదాన్ని పంచే చిత్రమిది’ అని తెలిపారు. గౌతంరాజు మాట్లాడుతూ ‘సూపర్‌ మార్కెట్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. సెన్సార్‌ పూర్తయింది’ అని పేర్కొన్నారు. నా కెరీర్‌కు చక్కటి శుభారంభాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని హీరో కృష్ణ చెప్పారు.

806

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles