సూపర్ మార్కెట్ ప్రేమకథ


Tue,March 12, 2019 11:56 PM

Krishna Rao Supermarket in Sensor

సీనియర్ నటుడు గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కృష్ణారావ్ సూపర్ మార్కెట్. శ్రీనాథ్ పులకురమ్ దర్శకుడు. బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ పతాకంపై గౌతంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎల్సా ఘోష్ కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, సస్పెన్స్ అంశాల సమాహారంగా సాగే చిత్రమిది. కృష్ణారావ్ సూపర్ మార్కెట్‌తో ఓ ప్రేమజంటకు ఉన్న సంబంధమేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. రొటీన్‌కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కించాం. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అని తెలిపారు. సెన్సార్‌కు సిద్ధమైన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. తనికెళ్లభరణి, రవిప్రకాష్, బెనర్జీ, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏ విజయ్‌కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: బోలే షావలి

405

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles