కృష్ణమనోహర్ ఐపీఎస్

Fri,November 22, 2019 11:57 PM

ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం పొన్ మానిక్‌వేల్. ముగిల్ చెల్లప్పన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని కృష్ణమనోహర్ ఐపీఎస్ పేరుతో పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఆర్ సీతారామరాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రం డిసెంబర్ మొదటివారంలో విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కించాం. పోలీస్ అధికారిగా ప్రభుదేవా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఆయన పాత్రచిత్రణ శక్తివంతంగా సాగుతుంది. సంఘవిద్రోహశక్తులతో సాగించిన పోరాటంలో అతడికి ఎదురైన పరిణామాలేమిటి? వ్యవస్థలోని అవినీతిని రూపుమాపడానికి నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ ఏం చేశాడు? అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ ఉంటుంది. ప్రభుదేవాను కొత్తపంథాలో ఆవిష్కరిస్తుంది. తెలుగుతో పాట తమిళంలో ఏకకాలంలో ఈసినిమా విడుదలకానుంది అని అన్నారు. బాహుబలి ప్రభాకర్, సురేష్‌మీనన్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు:భువనచంద్ర, సంగీతం:డి.ఇమ్మాన్, సమర్పణ: యనమల సుధాకర్‌నాయుడు.

330

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles