క్రేజీ క్రేజీ.. గీతాలు


Sun,February 17, 2019 12:28 AM

kreji kreji filing released on the 22nd

విష్వంత్, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్న చిత్రం క్రేజీ క్రేజీ ఫీలింగ్. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్ర గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో హీరో సుమంత్ అశ్విన్, నిర్మాత దామోదరప్రసాద్ విడుదలచేశారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ కుటుంబసమేతంగా చూసే వినోదాత్మక చిత్రమిది. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది అన్నారు. విష్వంత్ మాట్లాడుతూ ఇందులో కామెడీ ట్రైచేశాను. దానికి కారణం దర్శకుడే. భీమ్స్ మంచి పాటలిచ్చారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లక్ లల్వాని, భీమ్స్, సురేష్ ఉపాధ్యాయ, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు.

667

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles