ముగ్గురు కథానాయికలతో..


Sat,October 13, 2018 02:47 AM

Kranthi Madhav Director With Vijay Devarakonda

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై ఓ చిత్రం రూపొందనుంది. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్నారు. కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి కథానాయికలుగా నటించనున్నారు. ఈ నెల 18న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభంకానుంది. వినూత్న ప్రేమకథా చిత్రమిది. విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కలయికలో తొలిసారి రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు. ప్రారంభోత్సవం రోజున నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్, సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: జేకే, నిర్మాత: కె.ఏ.వల్లభ, సమర్పణ: కె.ఎస్.రామారావు, రచన, దర్శకత్వం: క్రాంతిమాధవ్.

4110

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles