సమాజానికి సందేశం అందించింది!


Sun,August 25, 2019 12:44 AM

Kousalya Krishnamurthy Movie Success Meet

కౌసల్య కృష్ణమూర్తి సినిమా చూసిన వారు శంకరాభరణం మాతృదేవోభవ లాంటి మరో గొప్ప సినిమా అంటున్నారు. అందరి ప్రశంసలు సినిమాకు మరింత బలాన్నిచ్చాయి అన్నారు కె.ఎస్.రామారావు. ఆయన సమర్పణలో ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రలో భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో రూపొందించిన కౌసల్య కృష్ణమూర్తి చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. కె.యస్.రామారావు మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాలతో పాటు విదేశాల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నది. చిన్న బడ్జెట్ సినిమాలకు, సమాజానికి ఓ సందేశం కలిగినటువంటి ఇలాంటి సినిమాలకు అందరి ప్రోత్సాహం కావాలి. అప్పుడు మరిన్ని మంచి సినిమాలొస్తాయి. ఇకనుంచి మా సంస్థ సమాజానికి ఉపయుక్తమయ్యే సినిమాల్ని అందిస్తుంది. నిజాయితీతో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాం అన్నారు. హైదరాబాద్‌లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా.

ప్రేక్షకులు అద్భుతమైన స్పందన కనబరుస్తున్నారు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశామని చెబుతున్నారు. ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తే కథానాయికలు ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు అని కథానాయిక ఐశ్వర్యరాజేష్ చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ మంచి కథను ఎంపిక చేసుకోవడంలోనే మేము విజయం సాధించాం. క్రియేటివ్ కమర్షియల్ సంస్థలో మంచి సినిమాలొస్తాయనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. అంతటా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. నా కెరీర్‌లో ఇదొక మైలురాయిలా నిలిచిపోతుంది అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా మంచి పాటలు రాసే అవకాశం లభించిందని, గీతాలు అందరిని ఆకట్టుకుంటున్నాయని పాటల రచయిత రాంబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

339

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles