రామారావు అనుభవాలు మాకు పాఠాలు!


Thu,August 22, 2019 12:01 AM

Kousalya Krishnamurthy movie Pre Release Event held at hyderabad

కె.ఎస్. రామారావు సినిమాల్ని ప్రేమిస్తుంటారు. సినిమాలే ఆయన జీవితం. ఎంత సంపాదించిన.. పోగొట్టుకున్నా సినిమాల్లోనేనని ఇది తప్ప తనకు మరో వ్యాపారం తెలియదని నాతో అన్నారు. రామారావు అనుభవాలు మాకు పాఠాలుగా ఉపయోగపడతాయి అని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తిక్‌రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్‌దేవరకొండ, హీరోయిన్ రాశీఖన్నా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కె.ఎస్.రామారావు సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కోసమే ఈ వేడుకకు వచ్చాను. పెళ్లిచూపులు నచ్చి మనం కలిసి సినిమా చేద్దామని కె.ఎస్.రామారావు.. క్రాంతిమాధవ్‌ను తీసుకొని నా దగ్గరకు వచ్చారు. రామారావును మేము డాడీ అని పిలుస్తుంటాం. ప్రతిరోజు సెట్స్‌కు వస్తారాయన. తండ్రిలా సినిమా ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటారు అని తెలిపారు. చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కలయికలో వస్తున్న సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న సమయంలో ఐశ్వర్యారాజేష్ నటించిన తమిళ చిత్రం కణా టీజర్ చూశాను.

ఆమె అభినయంతో పాటు కథ నచ్చడంతో చిత్ర రీమేక్ హక్కుల్ని పోటీ పడి తీసుకున్నాను. మాతృక కంటే ఎక్కువ కష్టపడి ఐశ్వర్యారాజేష్ ఈ సినిమా చేసింది. ఈ ఏడాది ఓ గొప్ప సినిమా చూశామనే అనుభూతిని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. ఈ నెల 23న విడుదల చేస్తున్నాంఅన్నారు. మహిళా క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, మాతృకలోని ఆత్మను తీసుకొని తన శైలికిఅనుగుణంగా సినిమాను రూపొందించానని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెప్పారు. తెలుగులో క్రాంతిమాధవ్ సినిమాను తొలుత అంగీకరించానని, కానీ కౌసల్య కృష్ణమూర్తి మొదటగా విడుదలవుతుందని, నటిగా తనకు ఈ చిత్రం చక్కటి శుభారంభాన్ని అందిస్తుందనే నమ్మకముందని ఐశ్వర్యారాజేష్ చెప్పింది. ఛాలెంజ్, పుణ్యస్త్రీ, ముత్యమంతముద్దు తర్వాత రామారావుగారి సంస్థలో తాను చేసిన సినిమా ఇదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోకూరి బాబూరావు, కార్తిక్‌రాజు, రాశీఖన్నా పాల్గొన్నారు.

832

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles