ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది!

Tue,January 22, 2019 11:42 PM

ముక్కుసూటిగా వ్యవహరించే ఓ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయితో కూడా అలాగే వ్యవహరిస్తే ఆ యుకుడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అన్నారు ప్రియాంత్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొత్తగా మా ప్రయాణం. రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ప్రియాంత్ మంగళవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ సినిమాలో కార్తీక్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపిస్తాను. నెలకు 2 లక్షలు సంపాదించే ఓ యువకుడి లైఫ్‌ైస్టెల్ నేపథ్యంలో ఆద్యంతం కొత్తగా రూపొందిన చిత్రమిది. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్. నేటి యువతరానికి, తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని అందిస్తుంది. నాన్న యస్ బ్యాంక్ డైరెక్టర్‌లలో ఒకరు. నగరంలోని ఓ బ్యాంక్‌లో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాను. నటుడిని కావాలని గత ఎనిమిదేళ్లుగా ప్రయత్నాలు చేశాను. ఈ సినిమాతో నా ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది అన్నారు.

1253

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles