కొరియన్ ఫిలిం ఫెస్టివల్


Sun,August 12, 2018 11:51 PM

Korean Film Festival In Telangana

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం తరఫున ప్రివ్యూ థియేటర్‌ను నిర్మించి ఔత్సాహిక సినిమా రూపకర్తలకు ఉపయోగపడేలా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చక్కటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నదన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రటరీ కె.ఎస్.రావు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఫెంటాస్టిక్ ఫైవ్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఇరాన్, ఫ్రెంచ్, జర్మనీ చిత్రోత్సవాల్ని నిర్వహించారు. తాజాగా కొరియన్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్‌తో కలిసి కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జరుపబోతున్నారు. ఈ కొరియన్ ఫిలిం ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో కె.ఎస్. రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నేషనల్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్ ప్రాంతీయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ సంయుక్తంగా విడుదలచేశారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7(2013), బ్యూటీ ఇన్‌సైడ్(2015), ఓడ్ టూ మై ఫాదర్(2014), ఐ కెన్ స్పీక్(2017), ది అటార్నీ(2013) చిత్రాల్ని ప్రదర్శిస్తాం. రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు చిత్ర ప్రదర్శన ప్రారంభం అవుతుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కళల పునర్మిర్మాణానికి, కళాకారులను ఆదరించడానికి మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ చక్కటి కృషి చేస్తున్నదని కె.ఎస్.రావు చెప్పారు.

680

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles