చిరంజీవితో సిద్ధం

Published: Mon,January 21, 2019 11:32 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. చిరంజీవి-కొరటాల శివ కలయికలలో రూపొందనున్న ఈ సినిమా గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నంటికి పుల్‌స్టాప్ పెడుతూ చిత్ర బృందం సోమవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ-చిరంజీవి చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు.

2117

More News