కోనాపురంతో విరోధం

Thu,November 7, 2019 12:23 AM

అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ. మచ్చ వెంకట్‌రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌కుమార్ నిర్మాతలు. కె.బి. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 8న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తుంటే నిజాయితీగా సినిమాను రూపొందించిన భావన కలుగుతున్నది. నేను సినిమా నిర్మించేందుకు హీరోల కోసం అన్వేషిస్తున్నాను. ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రతిభావంతులైన కొత్త హీరోలు చిత్రసీమకు పరిచయమయ్యే అవకాశం ఉంటుంది అని తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రెండు ఊళ్ల మధ్య విరోధం ప్రధానంగా సాగే సినిమా ఇది. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది అని చెప్పారు. వాస్తవికతకు ప్రాముఖ్యతనిస్తూ తెరకెక్కించిన గ్రామీణ ఇతివృత్తమిది, వాణిజ్య అంశాలకు చక్కటి సందేశాన్ని జోడించి రూపొందించామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, రేయాన్ రాహుల్ పాల్గొన్నారు.

184

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles