పోలీస్ కిల్లర్


Wed,May 8, 2019 12:26 AM

Kolaigaran an upcoming Tamil Movie starring Arjun Vijay Antony  Ashima Narwal

విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం కొలైగారన్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని పారిజాత క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్‌కుమార్, టి. శ్రీధర్ కిల్లర్ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఆషిమా నర్వాల్ కథానాయిక. జూన్ మొదటివారంలో ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ కథాంశమిది. నిజాయితీపరుడైన పోలీస్‌కు, ఓ కిల్లర్‌కు మధ్య సాగే పోరాటంలో విజేత ఎవరన్నది ఆసక్తిని పంచుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది. విజయ్ ఆంటోని, అర్జున్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. దుబాయ్‌లో చిత్రీకరించిన పాటలతో షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన టీజర్, గీతాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ నెల రెండో వారంలో ట్రైలర్‌ను విడుదలచేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని జరుపుతున్నాం. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది అని తెలిపారు. నాజర్, సీత, భగవతి పెరమాల్, గౌతమ్, సతీష్, సంపత్‌రామ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: భాష్యశ్రీ, సంగీతం: సైమన్.కె.కింగ్, సినిమాటోగ్రఫీ: మ్యూక్స్.

1147

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles