వినోదాల విందు


Sun,September 23, 2018 11:57 PM

KOBBARI MATTA MOVIE TEASER LAUNCH

సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. రూపక్ రొనాల్డ్ దర్శకుడు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నిర్మాతలు. నవంబర్ 14న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర సాంగ్‌టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ హృదయ కాలేయం కంటే వందరేట్లు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల వారిని అలరిస్తుంది అన్నారు. ఈ సినిమా కోసం మూడేళ్లు అనేక సమస్యల్ని అధిగమించాం. యూత్‌తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమా ఇది. ఈ సినిమా విషయంలో మాకు మద్దతు అందించిన బిగ్‌బాస్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో ముగ్గురు సంపూర్ణేష్‌లుంటారని, వినోదాల విందులా అందరిని మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. సమర్పకుడు కృష్ణారావు మాట్లాడుతూ సంపూర్ణేష్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ మొత్తం అమెరికాలో ఉంటుంది. సంపూ వర్సెస్ ట్రంప్ అనే టైటిల్ అనుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ముమైత్‌ఖాన్, కత్తి కార్తీక, మధుప్రియ, ధన్‌రాజ్, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

2049

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles