అర్జున్‌రెడ్డి రీమేక్‌లో?


Sun,September 23, 2018 11:37 PM

Kiara Alia Advani NeXt Movie Arun Reddy Movie Remake

తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించిన అర్జున్‌రెడ్డి చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు మాతృకకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించిన సందీప్‌రెడ్డి వంగా హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు పరిశ్రమలో కల్ట్ మూవీగా అభివర్ణింపబడిన అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత ఈ సినిమా కోసం తారా సుతారియాను కథానాయికగా తీసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ఇందులో కైరా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. భరత్ అనే నేను చిత్రం ద్వారా కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్‌లో వర్ధమాన నాయికగా ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది. అర్జున్‌రెడ్డి చిత్రంలోని కథానాయిక పాత్ర చిత్రణ నచ్చడంతో కైరా అద్వానీ రీమేక్‌లో నటించేందుకు అంగీకరించిందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.

3568

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles