ఆకాష్ పూరి జోడీగా..


Tue,March 12, 2019 12:07 AM

ketika sharma will be romancing with akash puri in romantic

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం ద్వారా అనిల్ పాదురి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ చిత్రంలో కథానాయికగా మోడల్ కెటికా శర్మను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. రెగ్యులర్ ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆకాష్‌పూరి ైస్టెలిష్‌లుక్స్‌తో కనిపిస్తాడు. పూరి మార్క్ సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని చిత్ర బృందం పేర్కొంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పకురాలు.

1330

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles