బాలీవుడ్‌లో అరంగేట్రం


Mon,July 22, 2019 12:01 AM

keerthy suresh to act in boney kapoor production and not accepting movies after mahanati

దక్షిణాదిలో పేరు సంపాదించుకున్న కథానాయికలు ఆ తర్వాత హిందీ చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపిస్తుంటారు. దక్షిణాది నుంచి వెళ్లిన ఎంతోమంది నాయికలు బాలీవుడ్‌లో తమదైన ముద్రను వేశారు. జాతీయస్థాయిలో లభించే ఆదరణతో ఇప్పుడు దక్షిణాది అగ్రనాయికల అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయి. అదే కోవలో తమిళ సోయగం కీర్తి సురేష్ బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే..అనతికాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా మహానటి ఈ సుందరి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. వరుస విజయాల స్ఫూర్తితో ఈ అమ్మడు హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇవ్వబోతున్నది. కీర్తి సురేష్ కథానాయికగా ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఓ అగ్ర దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కారణంగా కీర్తిసురేష్ తమిళంలో పలు భారీ అవకాశాల్ని తిరస్కరించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో మరక్కార్ అనే చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి.

849

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles