మరో సవాలుకు సిద్ధం!


Mon,August 19, 2019 12:07 AM

Keerthy Suresh Bollywood debut film to kick start soon

మహానటి చిత్రానికిగాను జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని గెలుచుకొని దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకట్టుకుంది కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో ఆమె ప్రదర్శించిన అద్భుతాభినయానికి దక్షిణాది ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగు, తమిళ పరిశ్రమల్లో బిజీగా ఉంది. ఇదిలావుండగా ఆమె హిందీలో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌శర్మ దర్శకుడు. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. బోనీ కపూర్ నిర్మాత. ఈ చిత్రంలో కీర్తి సురేష్..అజయ్‌దేవ్‌గణ్ సతీమణిగా భిన్న పార్శాలు కలిగిన పాత్రలో కనిపించనుందని సమాచారం. కాలేజీ యువతిగా, మధ్య తరగతి గృహిణిగా ఆమె పాత్ర విభిన్న కోణాల్లో సాగుతుందని చిత్రబృందం చెబుతున్నది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. చక్కటి అభినయానికి ఆస్కారమున్న పాత్ర ద్వారా కీర్తిసురేష్ బాలీవుడ్ అరంగేట్రం చేయడం పట్ల ఆమె సన్నిహితులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది మాదిరిగానే బాలీవుడ్‌లో కూడా ఈ మలయాళీ సోయగం సత్తాచాటుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

1203

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles