దిల్‌రాజు సమర్పణలో


Tue,July 16, 2019 01:03 AM

Keerthi Suresh sports comedy movie at Dilraju presentation

హైదరాబాద్ బ్లూస్ ఇక్బాల్ వంటి సినిమాలతో సృజనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నగేశ్ కుకునూర్. ఆయన తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతూ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ఓ స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
Keerthy-Suresh
ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్‌ను జరుపబోతున్నారు. క్రీడా నేపథ్యంలో వినోదం, రొమాన్స్ కలబోతగా ప్రేక్షకులకు నవ్యానుభూతినందించే చిత్రమిదని చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిరంతన్‌దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాత: శ్రావ్యవర్మ, నిర్మాణ సంస్థ: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్, నిర్మాత: సుధీర్‌చంద్ర, దర్శకత్వం: నగేష్ కుకునూర్.

513

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles