పవర్‌ఫుల్ పోలీస్‌స్టోరీ


Sat,November 17, 2018 02:45 AM

Kavacham Movie Relese Date December 7th

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కవచం. శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. 9 మిలియన్ వ్యూస్ రావడం ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం అన్నారు. హర్షవర్థన్‌రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, ఆర్ట్: చిన్నా.

2939

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles