వైవిధ్య పాత్రలతోనే నా ప్రయాణం


Thu,August 22, 2019 11:48 PM

Kausalya Krishnamurthy The Cricketer movie release today

కెరీర్‌లో ఎక్కువగా సవాళ్లతో కూడిన విలక్షణ పాత్రలు చేశాను. కమర్షియల్ ఫార్ములాకు కట్టుబడిపోకుండా పదహారు ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు వరకు అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయాను అని తెలిపింది ఐశ్వర్యాజేష్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఐశ్వర్యారాజేష్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి....

తాతయ్య అమర్‌నాథ్, నాన్న రాజేష్ తెలుగులో హీరోలుగా సినిమాలు చేశారు. అత్తయ్య శ్రీలక్ష్మి హాస్యనటిగా మంచి పేరును సొంతం చేసుకున్నది. ఘనమైన సినీ నేపథ్యమున్నా ఇప్పటివరకు తెలుగులో సినిమా చేయలేకపోయాను. కథాబలమున్న మంచి సినిమాతో తెలుగులో అడుగుపెట్టాలని ఎదురుచూసిన నా కల ఈ సినిమాతో నెరవేరింది. తొలుత విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను అంగీకరించాను. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో క్రాంతిమాధవ్ ద్వారా నేను నటించిన తమిళ చిత్రం కణా టీజర్ చూశారు నిర్మాత కె.ఎస్.రామారావు. తనకు బాగా నచ్చడంతో తెలుగులో రీమేక్ చేశారు. క్రికెటర్ కావాలని తపించే పల్లెటూరి యువతిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తన కల ఎలా నెరవేరిందన్నది ఆకట్టుకుంటుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని రాజమండ్రిలో ఎండకాలంలో చిత్రీకరించారు. ఎండ వేడికి శరీరం నల్లబడిపోయింది. క్రికెట్ ఆడే సమయంలో చాలా సార్లు గాయపడ్డాను. క్రికెటర్ పాత్ర కోసం తమిళనాడు మహిళా క్రికెట్ కోచ్ ఆర్తి శంకర్‌తో పాటు మరో ఇద్దరి వద్ద 75 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాను. ప్రాక్టీస్ సమయంలో నా బౌలింగ్ చూసిన కొందరు జాతీయ స్థాయి క్రికెటర్‌లా ఆడానని అన్నారు.

నాన్నతో నటించిన అనుభూతికలిగింది..

బాలనటిగా రాజేంద్రప్రసాద్‌తో రాంబంటు అనే సినిమా చేశా. నాన్నకు రాజేంద్రప్రసాద్ మంచి స్నేహితుడు. ఆయనకు సంబంధించిన ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని నాతో పంచుకున్నాను. రాజేంద్రప్రసాద్‌తో పనిచేస్తుంటే మా నాన్నతో నటించిన అనుభూతి కలిగింది. వడాచెన్నై అనే తమిళ చిత్రంలో 70 ఏళ్ల వృద్ధురాలిగా నటించాను. హిందీ సినిమాలో 65 ఏళ్ల వయస్కురాలిగా కనిపించాను. కాకముైట్టె సినిమాలో తల్లి పాత్రను పోషించాను. వైవిధ్యతను నమ్మే నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. తమిళంలో ఇరవై ఐదు, మలయాళంలో రెండు, హిందీలో ఓ సినిమా చేశాను.

751

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles