మహేష్‌బాబు సరసన..?


Sat,January 5, 2019 11:28 PM

katrina kaif may act mahesh babu and sukumar movie

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో మల్టీమిలియనీర్‌గా మహేష్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాచేయబోతున్నారు. ఇందులో బాలీవుడ్ సోయగం కత్రినాకైఫ్ కథానాయికగా నటించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల తరువాత బాలీవుడ్ సోయగం కత్రినాకైఫ్ మరో తెలుగు సినిమాలో నటించలేదు. దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత ఆమె తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కానుంది.
MAHESH.jpg
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం కోసం మహేష్‌కు జోడీగా కత్రినాకైఫ్‌ని ఖరారు చేయాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ వున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. మహేష్ నటన బాగుంటుందని, అతనితో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గతంలో ఓ బాలీవుడ్ మీడియాకు కత్రినాకైఫ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

3279

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles