గుణ ప్రేమకథ


Mon,June 17, 2019 11:30 PM

Kartikeya Guna 369 teaser released

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుణ 369’. అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనఘా కథానాయిక. సోమవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదలచేసింది. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కవాడి జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అంటూ సాయికుమార్‌ నేపథ్యగళంతో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ‘నేను ఎప్పుడూ అనుకోలేదండీ ఇలా బలవంతంగా షట్టర్‌ క్లోజ్‌ చేసి ఒక అమ్మాయితో మాట్లాడుతాననీ, నాతో మీరు మాట్లాడాల్సిన పనిలేదు.

మీతో మీరు మాట్లాడేయండి’ అంటూ హీరోహీరోయిన్ల మధ్య సాగే సంభాషణలు వినోదాన్ని పంచుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ ‘టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. యువతరంతో పాటు మాస్‌ ప్రేక్షకులు కోరుకునే హంగులన్నీ ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. మూడు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సన్నివేశాల్ని త్వరలోనే తెరకెక్కిస్తాం. ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. ప్రేక్షకుల్ని మెప్పించే హిట్‌ సినిమా తీశామనే నమ్మకంతో ఉన్నాం. కార్తికేయతో పాటు మా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అని తెలిపారు. టీజర్‌కు మించి సినిమా వెయ్యి రేట్లు బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, సినిమాటోగ్రఫీ: రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివమల్లాల, సత్యకిషోర్‌.

1120

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles